- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోతులను వెంబడించి తరిమిన గ్రామస్తులు..
by Batti.Sumithra |
అసలే' కోతి, ఆపై వనం వీడింది, జనంలోకి వచ్చింది. ఆహారం కోసం ఇండ్ల మీద, పంట పొలాల, ఆరబెట్టిన గింజల మీద దాడులు చేస్తున్నాయి.

X
దిశ, మామడ : అసలే' కోతి, ఆపై వనం వీడింది, జనంలోకి వచ్చింది. ఆహారం కోసం ఇండ్ల మీద, పంట పొలాల, ఆరబెట్టిన గింజల మీద దాడులు చేస్తున్నాయి. కోతుల వికృత శ్రేష్టలు మితిమీరిపోవడంతో వీటి బాధలనుంచి ఎలాగైనా విముక్తి పొందాలని గ్రామస్తులు నిర్ణయించారు.
ఆదివారం మండలంలోని పొన్కల్ గ్రామంలో ప్రతిసంఘము నుంచి పదిమంది చొప్పున సుమారుగా 200మంది వీధుల వెంబడి తిరుగుతూ కోతులను వెంబడించి గ్రామం నుంచి అటవీ ప్రాంతానికి తరలించారు. ప్రతిరోజు కోతుల బెడదతో జనాలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. యువకులు వివిధ రకాల జంతువుల మాస్కులు ధరించడంతో కోతులు వీరిని చూసి పరారయ్యాయి. ఏది ఏమైనా కోతులబెడద నుంచి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Next Story






