బాసర ట్రిపుల్ ఐటీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి

by Nallavelli.Anjaneyulu |

2014 నుంచి బాసర ట్రిపుల్ ఐటీ లో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన త్రిబుల్ ఐటీ సమస్యలపై మాట్లాడారు.

బాసర ట్రిపుల్ ఐటీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి
X

దిశ, భైంసా : 2014 నుంచి బాసర ట్రిపుల్ ఐటీ లో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన త్రిబుల్ ఐటీ సమస్యలపై మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ట్రిపుల్ ఐటీ విద్యార్థి తేజస్విని మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ ఘటన జరిగిందనీ, సరైన వైద్య సదుపాయం లేకపోవడం మూలంగానే ఒక నిండు ప్రాణం బలైంది అన్నారు. ట్రిపుల్ ఐటీ లో సమస్యలు రాజ్యమేలుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని,గత ఆరు సంవత్సరాల క్రితం అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ కొన్ని కంప్యూటర్లు మాత్రమే ఇచ్చారని, విద్యార్థులకు కంప్యూటర్లు, ల్యాప్టాప్ లు లేకపోవడం వలన విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేకపోతున్నారన్నారు. పేర్లు మార్చి అదే మెస్ కాంట్రాక్టర్లు సంవత్సరాల తరబడి ఉంటున్నారని, నామినేషన్ పద్ధతిని తొలగించి టెండర్లు వేయాలన్నారు. ట్రిపుల్ ఐటీ పర్యవేక్షణకు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, విద్యావంతులతో కూడిన ఒక కమిటీని వేయాలన్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నియామకాల ప్రక్రియ పారదర్శకంగా లేదని, సమస్యలు అడిగితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని అధికారులు విద్యార్థులను బెదిరిస్తున్నారని అన్నారు. అక్కడ ఉన్న బేకరీ యజమాని ఇష్టనుసారం గా వ్యవహారిస్తూ అధిక ధరలకు అమ్మి విద్యార్థులను నిలువుగా దోచుకుంటున్నారన్నారు.ఇకనైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

Next Story