- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెట్టు తొర్రలో వెంకటేశ్వరుడు..సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం..!
దిశ, బెజ్జూర్ : చెట్టు తొర్రలో వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో గడిచిరెల్లి జిల్లాలోని వెంకటాపూర్ సమీపంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం కొమురం

దిశ, బెజ్జూర్ : చెట్టు తొర్రలో వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో గడిచిరెల్లి జిల్లాలోని వెంకటాపూర్ సమీపంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లాలంటే చింతలమాన పెళ్లి మండలం నుంచి గూడెం మీదుగా మహారాష్ట్రలోని అహేరి నుండి వెళ్లాల్సి వస్తుంది . రోడ్డు సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి నిత్యంపూజలు అందుకుంటున్నాడు శ్రీవేంకటేశ్వరుడు. వెంకటేశ్వర స్వామి చెట్టు తొర్రలో పూజలు అందుకుంటున్నారు. చెట్టు సమీపంలో నీటి కాలువ ఉండడంతో తోగు వెంకటాపూర్ అని పేరు ఉంది. ఈ ఆలయానికి తెలంగాణ.. మహారాష్ట్ర భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో నిత్యం సత్యనారాయణ స్వామి పూజలు, గోవింద నామాలతో భక్తులు పూజిస్తుంటారు. ఈ ఆలయంలో కేశఖండనాలు, కర్ణ వేదనలు జరుగుతుంటాయి. వందలాది సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ ఆలయానికి కనీస సౌకర్యాలు కరువయ్యాయని భక్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయం వెంకటాపూర్ గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ ఆలయానికి మరో తిరుపతిగా పేరున్నప్పటికీ ఆలయానికి సౌకర్యాలు కల్పించడంలో మహారాష్ట్ర ప్రభుత్వ విఫలమైంది.






