- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ లో చేరడం అదృష్టంగా భావిస్తున్న: విద్యావంతురాలు వసంత
by Ratna Kumari |
దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన విద్యావంతురాలు

X
దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన విద్యావంతురాలు బత్తుల వసంత (అలఖ్య) గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విద్యావంతురాలు వసంత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి ఏర్పడ్డ కొత్త రాష్ట్రంలోనే పేద, గిరిజన బిడ్డలకు గురుకులాలు కట్టించి, 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు నిర్మించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన కేసీఆర్ పార్టీలో చేరడం అదృష్టమని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ విద్యావంతులు రాజకీయాల్లో రాణించాలని వారి పట్ల పలువురికి అవగాహన కలుగుతుందని అన్నారు. యువకులు సైతం రాజకీయ రంగాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
Next Story






