రైలు నుంచి జారి పడి ఇద్దరు మృతి

by Bhanu |

మంచిర్యాల జిల్లా రేచిని రోడ్ - బెల్లంపల్లి రైల్వేస్టేషన్ మధ్య ఆదివారం ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు బెల్లంపల్లి రైల్వే పోలీసులు తెలిపారు.

రైలు నుంచి జారి పడి ఇద్దరు మృతి
X

దిశ, తాండూర్ : మంచిర్యాల జిల్లా రేచిని రోడ్ - బెల్లంపల్లి రైల్వేస్టేషన్ మధ్య ఆదివారం ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు బెల్లంపల్లి రైల్వే పోలీసులు తెలిపారు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు రైలు నుండి జారిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరి వయసు 40-45 సంవత్సరాలు, బక్కపలుచని దేహం, తెల్లని లాల్చీ పైజామా ధరించాడు.

ఎడమ చేతి పైన, మెడపై ఎడమ వైపు పచ్చబొట్టులు ఉన్నాయి. నాగపూర్ నుండీ కాచిగూడ వరకు టిక్కెట్ తీసుకున్నాడు. మరొకరి వయసు 25-30 సంవత్సరాలు కాగా బక్కపలుచని దేహం, బెల్లంరంగు ఫుల్ హ్యాండ్స్ వింటర్ స్వెట్టర్, మెరూన్ రంగు ఫుల్ హ్యాండ్స్ షర్ట్, గోధుమ రంగు జీన్స్ ప్యాంట్ ధరించాడు. ఎడమ చేతి పైన పచ్చ బొట్టు కలదు. చనిపోయిన ఇద్దరు వ్యక్తులు బహుశా ముస్లింలు అయి ఉంటారని పోలీసు భావిస్తున్నారు. వివరాలు తెలిసినవారు 8712658596, 9490871784, 9949304574 సంప్రదించాలని జి ఆర్ పి పోలీసులు తెలిపారు.

Next Story