మద్యం మత్తులో గ్రూప్ వార్..

by Ratna Kumari |

దిశ, మందమర్రి: మ‌ద్యం మ‌త్తులో గ్రూపు వార్ జ‌రిగిన ఘ‌ట‌న మంద‌మ‌ర్రి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెల్లితే.. ముఖ్యంగా మద్యం మత్తులో అల్లరి మూకలు

మద్యం మత్తులో గ్రూప్ వార్..
X

దిశ, మందమర్రి: మ‌ద్యం మ‌త్తులో గ్రూపు వార్ జ‌రిగిన ఘ‌ట‌న మంద‌మ‌ర్రి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెల్లితే.. ముఖ్యంగా మద్యం మత్తులో అల్లరి మూకలు రెచ్చిపోయి పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. రెండు గ్రూపులు పరస్పరం రాళ్ళు, కర్రలతో కొట్టుకున్నారు. తాగిన మైకంలో రోడ్డు పై వెళ్తున్న ఆటో హరాన్ చేస్తూ.. పక్కకు జరగండి అనే సరికి మత్తులో ఆటో ఉన్న వాళ్లపై ఇద్దరు విచక్షణ రహితంగా దాడి చేశారు. జరిగిన విషయాన్ని ఆటో డ్రైవర్ వాళ్ళ స్నేహితులకు చెప్పడంతో ఆటో డ్రైవర్ స్నేహితులు ఆరుగురు ఆటో లో వచ్చి మొదట దాడి చేసిన ఇద్దరి పైనా దాడి చేశారు. దీంతో స్థానికులు భయ బ్రాంతులు గుర‌య్యేలా షర్ట్ విప్పి రోడ్డుపై కర్రలతో, రాళ్లతో పరిగెత్తుతూ రోడ్లపైకి వచ్చి కొట్టుకున్నారు పోలీసులు రావ‌ణ దహన కార్యక్రమంలో మంత్రి వివేక్ రావడంతో బందో బస్తుల్లో ఉన్నారు. ఆటో సీజ్ చేసి నిందితులు కస్టడీలోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను మాత్రం పరారీలో ఉన్నారని ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

Next Story