- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హత్య కేసులో ఇద్దరు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష.
ఆదిలాబాద్ జిల్లా లోని జైనథ్ మండలంలో వై ఆర్ కే కన్స్ట్రక్షన్ ఏరియా వద్ద జనవరి 4,2022 జరిగిన హత్య కేసులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు ముద్దాయిలు ఇద్దరికీ యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, ఇద్దరికి చెరో 4000 రూ . ల చొప్పున జరిమానా విధిస్తు బుధవారం తీర్పు వెలువరించినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు.

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా లోని జైనథ్ మండలంలో వై ఆర్ కే కన్స్ట్రక్షన్ ఏరియా వద్ద జనవరి 4,2022 జరిగిన హత్య కేసులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు ముద్దాయిలు ఇద్దరికీ యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, ఇద్దరికి చెరో 4000 రూ . ల చొప్పున జరిమానా విధిస్తు బుధవారం తీర్పు వెలువరించినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. జైనథ్ మండలంలో జనవరి 4,2022 న బంగారి గూడకు చెందిన A1) షేక్ అస్లాం, A2) కోకాటి విజయ్ లు వీరిద్దరూ కలిసి తమ మిత్రుడైన న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ కు చెందిన ఇందూర్ గజానంద్ ని నమ్మించి తనకున్న హీరో హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్ ఎలాగైనా దొంగతనం చేయాలని కుట్రతో ఆదిలాబాద్ నుండి పథకం ప్రకారం జైనత్ వైపు చాందా మీదుగా తీసుకు వెళ్లారని తెలిపారు.
డబ్బులు కావాలనే ఉద్దేశంతో ఇందూర్ గజానంద్ ను కత్తితో గొంతు కోసి జైనథ్ శివారులోని వై ఆర్ కే కన్స్ట్రక్షన్ ఏరియా వద్ద పడేసి మృతుడి మోటార్ సైకిల్ దొంగతనం చేసి పారిపోయారని తెలియజేశారు. అదే రోజు విషయం తెలుసుకున్న ఎస్సై కే జగదీష్ గౌడ్ స్థానిక సర్పంచ్ నుండి దరఖాస్తు తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని తెలిపారు.అప్పటి ఎస్సై బి పెర్సెస్, సీఐకే మల్లేష్ సహకరించగా కే నరేష్ కుమార్ సిఐ నిందితులను విచారించి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారన్నారు.స్థానిక జిల్లా కోర్టు లో కోర్టు డ్యూటీ అధికారి జమీర్ 25 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా ప్రభుత్వ న్యాయవాది పిపి మేకల మధుకర్, రహీం లు సాక్షులను విచారించి నేరం రుజువు చేయగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు ఇద్దరు నిందితులకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, జరిమానా వేధించడం జరిగిందని తెలిపారు. కేసులో సాక్షులను విచారించి,నేరం రుజువు చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను అభినందించారు.






