గిరిజన యువత కోట్నాక భీంరావ్‌ను ఆదర్శంగా తీసుకొవాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

by Nalla Sampath Reddy |

గిరిజన యువత కోట్నాక భీంరావ్‌ను ఆదర్శంగా తీసుకొవాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
X

దిశ, ఆసిఫాబాద్: నేటి గిరిజన యువత స్వర్గీయ మాజీ మొట్టమొదటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కోట్నాక భీంరావ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని, రాజకియాల్లో రావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. శుక్రవారం ఆసిఫాబాద్ పట్టణంలో కోట్నాక భీంరావ్ 23వ వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్, జిల్లా అదనపు కలెక్టర్ దిపక్ తివారీ, ఎమ్మెల్యే కోవలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, తుండు దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్, జిల్లా జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, సీనియర్ నాయకుడు అరిగేలా నాగేశ్వరరావు, పలు సంఘాల ముఖ్య నాయకులు తరలివచ్చి కోట్నాక భీం రావ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Next Story