- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రావణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : ఆదివాసీ నాయకులు
దిశ, బెజ్జూర్ : దహేగం మండలం గేరే గ్రామంలో జరిగిన కుల హత్యకు గురైన తొమ్మిది నెలల గర్భిణీ శ్రావణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆదివాసి కోయ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సోయం

దిశ, బెజ్జూర్ : దహేగం మండలం గేరే గ్రామంలో జరిగిన కుల హత్యకు గురైన తొమ్మిది నెలల గర్భిణీ శ్రావణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆదివాసి కోయ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సోయం చిన్నయ్య డిమాండ్ చేశారు. మంగళవారం బెజ్జూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ కు ఆదివాసీ సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. శ్రావణి కుటుంబానికి ప్రభుత్వం రూ. 20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రక్షణ కల్పించాలని, కుటుంబానికి మూడెకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, కులాంతర రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితునికి శిక్షపడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి కోయ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిన్నయ్య, ఆదివాసీ నాయకులు తలండి మధుకర్, కోట సతీష్, తిరుపతి, సరళ, వెంకటేష్ ,శంకర్, కోరేత తిరుపతి, అమృత పాల్గొన్నారు.






