Fire Accident : మందమర్రిలో పేలిన ట్రాన్స్‌ఫార్మర్... భారీగా ఎగిసి పడుతున్న మంటలు

by Muthe.Rajitha |

మంచిర్యాల జిల్లా మందమర్రి(Mandamarri)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) చోటు చేసుకుంది.

Fire Accident : మందమర్రిలో పేలిన ట్రాన్స్‌ఫార్మర్... భారీగా ఎగిసి పడుతున్న మంటలు
X

దిశ, వెబ్ డెస్క్ : మంచిర్యాల జిల్లా మందమర్రి(Mandamarri)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) చోటు చేసుకుంది. పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం ఎదుట ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోయి(Transformer Blast), భారీగా మంటలు ఎగసిపడటం తీవ్ర కలకలం రేపింది. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఎగసిన మంటలతో ప్రధాన విద్యుత్ తీగలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ వెంటనే కరెంట్ సరఫరా నిలిపివేసింది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కాగా ట్రాన్స్‌ఫార్మర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలడం, అనంతరం ఉవ్వెత్తున మంటలు రేగడంతో స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Next Story