యోగాతో సంపూర్ణ ఆరోగ్యం : జీఎంఎన్ రాధాకృష్ణ

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, మంద‌మ‌ర్రి : యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం ల‌భిస్తుంద‌ని జీఎం ఎన్. రాధాకృష్ణ తెలిపారు. మందమర్రి ఏరియా సి.ఈ.ఆర్ క్లబ్ లో మంగళవారం నిర్వహించిన మిషన్ హెల్తీ సింగరేణి, ప్రాచీన యోగ దినచర్య,

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం : జీఎంఎన్ రాధాకృష్ణ
X

దిశ‌, మంద‌మ‌ర్రి : యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం ల‌భిస్తుంద‌ని జీఎం ఎన్. రాధాకృష్ణ తెలిపారు. మందమర్రి ఏరియా సి.ఈ.ఆర్ క్లబ్ లో మంగళవారం నిర్వహించిన మిషన్ హెల్తీ సింగరేణి, ప్రాచీన యోగ దినచర్య, 15 సంవత్సరాల శాస్త్రీయ పరిశోధన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజ‌రై ఆయ‌న మాట్లాడుతూ సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం ఆదేశాల మేరకు మిషన్ హెల్తి సింగరేణి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందన్నారు .ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నప్పుడే తన యొక్క కుటుంబం బాగుంటుందని, కుటుంబం బాగున్నప్పుడే సమాజం బాగుంటుందని తద్వారా, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరం కృషి చేసిన వాళ్ళం అవుతామని వారు అన్నారు. శారీరక శ్రమ, ఆటలతో పాటు యోగాను కూడా జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో హైద‌రాబాద్ నివాసి ష‌ణ్ముక, జీఎం ల‌లిత్ ప్ర‌సాద్, ఏఐటీయూసీ బెల్లంప‌ల్లి బ్రాంచ్ సెక్రెట‌రీ దాగం మ‌ల్లేష్, టీ. శ్రీధ‌ర్, జీవీటీసీ మేనేజ‌ర్, జీవీటీసీ శిక్ష‌కులు అశోక్, సీనియ‌ర్ ప‌ర్స‌న‌ల్ ఆఫీస‌ర్ శంక‌ర్, సీనియ‌ర్ సెక్యూరిటీ ఆఫీస‌ర్ ర‌వి పాల్గొన్నారు.

Next Story