- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిర్యాణీలో పులి కలకలం.. గ్రామాల్లో భయాందోళన
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణీ మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది.

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణీ మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఆదివారం తిర్యాణీ మండలంలోని ఎదులపాడు శివారులోని అటవీ ప్రాంతంలో మేత కోసం తీసుకెళ్లిన పశువుల మందపై పులి దాడికి యత్నించిందని పశువుల కాపరులు తెలిపారు. వారు చప్పట్లు కొడుతూ కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి పారిపోయినట్లు చెప్పారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు ఖండించారు. పులి సంచారం లేదని, ఇది వట్టి పుకార్లేనని స్పష్టం చేశారు. ప్రజలు ఊహాగానాలతో భయపడకండని, ఎవ్వరూ నాయొద్దని వారు కోరారు.
అయితే, ఇదంతా పుకార్లేనా? అనేదానిపై స్థానికులలో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గత బుధవారం కైరిగూడ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ శివారులో పులి సంచారం జరిగినట్లు అటవీశాఖ అధికారులు స్వయంగా గుర్తించి ధృవీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎదులపాడు వద్ద కనిపించినదీ అదే పులేనా? లేక మరో పులా? అనే ప్రశ్నలు గ్రామాల్లో వేడెక్కుతున్నాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.






