- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, తాండూర్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గిన్నెధరి రేంజ్ పరిధిలోని మంగి అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. మంగి అటవీ పరిధిలోని ముల్కల మంద బీట్ లో శనివారం పులి అడుగులను గుర్తించామన్నారు. అది పెద్దపులినా లేదా చిరుతపులినా అనే సమాచారం తెలియాల్సి ఉందన్నారు. సమీప గ్రామ ప్రజలు, పశువుల కాపర్లు, రైతులు ఎవరు కూడా అటవీ ప్రాంతంలోనికి వెళ్ళొద్దని, జాగ్రత్తగా ఉండాలన్నారు. పులి జాడ కోసం తిర్యాని, గిన్నెధరి రేంజ్ సిబ్బంది గాలిస్తున్నారని తెలిపారు.
- Tags
- tigers
- Telug News
Next Story






