- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పశువులపై దాడి చేసి హతమార్చిన పులి
కొమురం భీం ఆసిఫాబాద్ - మంచిర్యాలలోని సరిహద్దు గ్రామంలో పులి కలకలం రేపింది.

X
దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ - మంచిర్యాలలోని సరిహద్దు గ్రామంలో పులి కలకలం రేపింది. బుధవారం రాత్రి దొండ్ల గ్రామ శివారులోని దేవాపూర్ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేసింది. తిర్యాణీ మండలంలోని ఏదులపాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని దొండ్ల గ్రామంలోని తుమ్రం మల్కు, నైతం శేఖర్, తుంరం భీములకు చెందిన పశువుల పై పులి పంజా విసిరింది. ఇక పులి దాడి మృతి చెందిన పశువులకు అటవీ శాఖ అధికారులు సంచనామా నిర్వహించి, నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అటు ఈ ఘటన తమ పరిధిలోకి రాదని.. అధికారులు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించినట్లు రైతులు తెలుపుతున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం ఇంకా పులి దాడిలో పశువులు మృతి చెందినట్లు నిర్థారణ చేయలేదు.
Next Story






