BREAKING: రైల్వే బ్రిడ్జి పనుల్లో ప్రమాదం.. జారిపడిన కార్మికులు.. మధ్యలోనే?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-08 09:26:58  IST  )

పెద్దవాగు రైల్వే బ్రిడ్జి పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. ముగ్గురు కార్మికులు పైనుంచి జారిపడ్డారు.

BREAKING: రైల్వే బ్రిడ్జి పనుల్లో ప్రమాదం.. జారిపడిన కార్మికులు.. మధ్యలోనే?
X

దిశ, వెబ్‌డెస్క్: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ వద్ద పెనుప్రమాదం చోటుచేసుకుంది. పెద్దవాగుపై రైల్వే బ్రిడ్జి పనులు చేస్తుండగా.. ముగ్గురు కార్మికులు జారిపడ్డారు. వీరిలో ఒకరు మధ్యలో ఇరుక్కుపోగా.. వైద్యులు స్పాట్ కు చేరుకుని అక్కడే చికిత్స చేస్తున్నారు. కార్మికుడికి తీవ్ర రక్తస్రావం జరిగి, శరీర భాగాలు నలిగిపోవడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆక్సిజన్ అందిస్తూ ట్రీట్మెంట్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వాగుపై మూడో రైల్వే లైన్ నిర్మాణం కోసమై.. కొత్త వంతెనను నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు జరుగుతుండగానే ప్రమాదం సంభవించింది. స్థానికులు, తోటి కార్మికులు గాయపడిన ఇద్దరు కార్మికులను శిథిలాల నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ప్రమాదానికి రైల్వే కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని మిగతా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని, నిర్మాణ పనులు భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. సదరు కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story