- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్మల్ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో మూడు పార్టీలకు ఆదరణ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడు పార్టీలకు పంచాయతీ ఓటర్లు పట్టం కట్టారు.

దిశ ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడు పార్టీలకు పంచాయతీ ఓటర్లు పట్టం కట్టారు. మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన మూడు రాజకీయ పార్టీలకు ఓటర్లు భిన్నమైన తీర్పును ఇచ్చారు. అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు ఇచ్చినప్పటికీ.. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ భారత్ రాష్ట్ర సమితి పార్టీలను సైతం ఆదరించారు.
కాంగ్రెస్ పై చేయి..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఓటర్లు ఆదరించారు. తొలి రెండు విడతల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ఓటర్లు.. చివరి విడత భిన్నమైన తీర్పును ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ పైచేయిగా నిలిచింది. అయితే భారత్ రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీలు రెండు కూడా తీసిపోలేని రీతిగా స్థానాలు దక్కించుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నిర్మల్, ఆదిలాబాద్ మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆశించిన స్థాయిలోనే స్థానాలు సంపాదించారు.
చివరి విడతలో కాంగ్రెస్ బేజారు..
మూడు దఫాలుగా జరిగిన ఎన్నికలకు సంబంధించి చివరి విడతలో అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు 11 మంది గెలుపొందడం చర్చకు దారితీసింది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసం ఉన్న రాజంపేట గ్రామపంచాయతీ ఎన్నిక తీవ్ర ఉత్కంఠ కి దారి తీసింది. ఆ గ్రామ పంచాయతీ గులాబీ పార్టీ విజయం సాధించింది. అలాగే ముధోల్ నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను భారతీయ జనతా పార్టీ దక్కించుకున్నది.
మూడు పార్టీలకు ఆదరణ..
మూడు రాజకీయ పార్టీలకు గ్రామ పంచాయతీ ఓటర్లు ఆదరించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఈ నియోజకవర్గంలో బుధవారం జరిగిన ఎన్నికల్లో 11 మంది రెబల్ అభ్యర్థులు గెలుపొందారు. బోథ్ నియోజకవర్గంలో అమూల్యంగా గులాబీ పార్టీ భారీ స్థానాలను కైవసం చేసుకున్నది.






