సైబ‌ర్ మోసానికి మ‌రో ముగ్గురు వ్య‌క్తులు బ‌లి..!

by Ratna Kumari |

దిశ‌, ఆసిఫాబాద్ : సైబ‌ర్ మోసాల‌కు బ‌లి కాకూడ‌ద‌ని అధికారులు, అనుభ‌వ‌జ్ఞులు ఎంత చెప్పినా ఎక్క‌డో ఒక చోట మాత్రం మోస‌పోతూనే ఉన్నారు. మోస‌పోయే వాళ్లు

సైబ‌ర్ మోసానికి మ‌రో ముగ్గురు వ్య‌క్తులు బ‌లి..!
X

దిశ‌, ఆసిఫాబాద్ : సైబ‌ర్ మోసాల‌కు బ‌లి కాకూడ‌ద‌ని అధికారులు, అనుభ‌వ‌జ్ఞులు ఎంత చెప్పినా ఎక్క‌డో ఒక చోట మాత్రం మోస‌పోతూనే ఉన్నారు. మోస‌పోయే వాళ్లు ఉన్నంత వ‌ర‌కు మోసం చేస్తూనే ఉంటారు. తాజాగా కాగ‌జ్ న‌గ‌ర్ కి చెందిన ముగ్గురు వ్య‌క్తులు మోస‌పోవ‌డం గ‌మ‌నార్హం. రోజు రోజుకు టెక్నాల‌జీ పెరుగుతున్న నేప‌థ్యంలో మోసాల కొత్త త‌ర‌హాలో జ‌రుగుతున్నాయి. సైబ‌ర్ నేర‌గాళ్లు మాత్రం మోసాల‌కు పాల్ప‌డి డ‌బ్బులు దండుకుంటే.. అమాయ‌క ప్ర‌జ‌లు డ‌బ్బులు పోగొట్టికొని ఇబ్బందులు ప‌డుతున్నారు.


కాగ‌జ్ న‌గ‌ర్ ప‌ట్ట‌ణానికి చెందిన ముగ్గురు వ్య‌క్తుల‌కు ఫోన్ చేసి సైబ‌ర్ మోస‌గాళ్లు 2ల‌క్ష‌ల 30వేలు కాజేశారు. వారిలో ఇద్ద‌రూ వ్యాపారులు ఒక‌రి వ‌ద్ద నుంచి రూ.90వేలు, మ‌రో వ్య‌క్తి వ‌ద్ద నుంచి 70వేలు, ఓ ఉద్యోగి నుంచి 70వేలు కాజేశారు. ఈ మేర‌కు బాధితులు శ‌నివారం కాగజ్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు.

Next Story