- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డుప్రమాదం.. బైకును ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి
దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దీపావళి పండుగకు తమ్ముడు తన పిల్లలతో కలిసి తల్లి గారింటికి సంతోషంగా

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దీపావళి పండుగకు తమ్ముడు తన పిల్లలతో కలిసి తల్లి గారింటికి సంతోషంగా బైక్ వెళ్తుండగా.. కారు ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. కాగజ్ నగర్ మండలంలోని వంజీరి గ్రామానికి చెందిన జగన్ (27), డోంగ్రి అనుసూయ( 32) ప్రజ్ఞశీల్ 4 అక్కడిక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వాంకిడి మండలంలోని బెండార గ్రామానికి చెందిన జగన్ దీపావళి పండుగ వంజీరిలో ఉంటున్న తన అక్క అనుసూయ. మేనల్లుడు ప్రజ్ఞాశీల్ తన బైక్ ఎక్కించుకొని బెండారకు వస్తున్న క్రమంలో మోతుగూడ సమీపంలో కారు వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో జగన్ తో పాటు అక్కా అనుసూయ, మేనల్లుడు ప్రజ్ఞాశీల్ అక్కడిక్కడే మరణించారు. తీవ్ర గాయాలతో ఉన్న మరో వ్యక్తిని చికిత్స కోసం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరందరూ ఓకే కుటుంబానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.






