మధుకర్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి : బీజేపీ

by Nallavelli.Anjaneyulu |

దిశ, తాండూర్ : బీజేపీ నాయ‌కుడు మ‌ధుక‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌కులైన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని బీజేపీ నాయ‌కులు ఇవాళ మండ‌ల కేంద్రంలోని ఐబీ జాతీయ ర‌హ‌దారిపై రాస్తారోకో

మధుకర్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి : బీజేపీ
X

దిశ, తాండూర్ : బీజేపీ నాయ‌కుడు మ‌ధుక‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌కులైన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని బీజేపీ నాయ‌కులు ఇవాళ మండ‌ల కేంద్రంలోని ఐబీ జాతీయ ర‌హ‌దారిపై రాస్తారోకో నిర్వ‌హించారు. దీంతో రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచి ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షులు ఏట మధుకర్ ఆత్మహత్య కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, ఎస్సై ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న మధుకర్ పై కక్ష సాధింపు చర్యలో భాగంగా అక్రమంగా కేసు బనాయించి ఆత్మహత్యకు కారణమయ్యారని ఆరోపించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంటనే స్పందించి మధుకర్ ఆత్మహత్యకు కారకులైన వారిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి మధుకర్ కుటుంబాన్ని ఆదుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చర్యలు తీసుకోవాలని కోరారు. తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ రాస్తారోకో వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్న నాయకులను బలవంతంగా తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. కార్యక్రమంలో నాయకులు భరత్ కుమార్, మహీధర్ గౌడ్, శ్రీకృష్ణదేవరాయలు, తిరుపతి, శేషగిరి, తుకారం, మల్లేష్, సీతాల్, చిరంజీవి, కుమార్, సురేష్, ప్రవీణ్, చరణ్ పాల్గొన్నారు.

Next Story