బ‌స్సు పై యువ‌కుడు హ‌ల్ చ‌ల్

by Ratna Kumari |

దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లోని గోసంపల్లె గ్రామంలో మంగళవారం గుగులవత్ శ్రీధర్ అనే యువకుడు ఆర్టీసీ బస్సు పైకి ఎక్కి హల్చల్ చేసిన ఘటన

బ‌స్సు పై యువ‌కుడు హ‌ల్ చ‌ల్
X

దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లోని గోసంపల్లె గ్రామంలో మంగళవారం గుగులవత్ శ్రీధర్ అనే యువకుడు ఆర్టీసీ బస్సు పైకి ఎక్కి హల్చల్ చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాలకై ఖానాపూర్ నుండి గోసంపల్లి గ్రామం మీదుగా జగిత్యాల్ జిల్లాకు వెళ్లే ఆర్టీసీ బస్సు పైకి మతిస్థిమితం లేని గుగ్లావత్ శ్రీధర్ అనే యువకుడు బస్సు పై ఎక్కి హల్చల్ చేశాడు. మతిస్థిమితం లేని యువకుడు ఆర్టీసీ బస్సు పై హల్చల్ చేయడంతో గ్రామస్తులు అతనిని దింపడానికి నానా తిప్పలు పడ్డారు. అయినా దాదాపు రెండు గంటలు పాటు ఆర్టీసీ బస్సు ఆగిపోవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు, వచ్చిపోయే వాహనదారులకు ఇబ్బందులకు గురయ్యారు. యువకుడిని ఆర్టీసీ బస్సు పై నుండి దింపడానికి ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్, పోలీస్ సిబ్బందికి ఫిర్యాదు చేయగా ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పోలీసులు, గ్రామస్తులు, నాన్న తంటలు పడి ఎట్టకేలకు బస్సు పై నుండి మతిస్థిమితం లేని యువకుడు శ్రీధర్ ను బస్సు దింపారు.శ్రీధర్ ను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Next Story