మీడియా ప్ర‌తినిధుల‌కు గ్రామ కార్య‌ద‌ర్శి క్ష‌మాప‌ణ చెప్పాలి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, ఆసిఫాబాద్ : మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వాంకిడి గ్రామ కార్యదర్శి శివ్ కుమార్ క్షమాపణ చెప్పాలని ఆసిఫాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు డిమాండ్ చేశారు.

మీడియా ప్ర‌తినిధుల‌కు గ్రామ కార్య‌ద‌ర్శి క్ష‌మాప‌ణ చెప్పాలి
X

దిశ‌, ఆసిఫాబాద్ : మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వాంకిడి గ్రామ కార్యదర్శి శివ్ కుమార్ క్షమాపణ చెప్పాలని ఆసిఫాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు డిమాండ్ చేశారు. కార్యదర్శి తీరును నిరసిస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిల్చోని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు మాట్లాడారు సర్పంచ్ ప్రమాణస్వీకారం న్యూస్ కవరేజ్ కు వెళ్లిన ఓ దళిత జర్నలిస్టు పట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి దురుసుగా ప్రవర్తించడంతో నీ సంగతి చూస్తానంటూ బెదిరింపుకు పాల్పడ్డారని చెప్పారు. మీడియా ప్రతినిధులకు గ్రామ కార్యదర్శి బహిరంగ క్షమాపణ చెప్పాలని.. అలాగే అతని పై సంబంధిత జిల్లా అధికారి తాగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Next Story