దొరికిన కాడికి దండుకుంటున్న హ‌మాలీలు.. రైతుల‌కు త‌ప్ప‌ని ఇబ్బందులు..!

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, కుబీర్ : మండల కేంద్రంలోని సోయా కొనుగోలు కేంద్రంలో రైతులను హమాలీలు అందిన కాడికి దండుకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. సోయాలు జల్లెడ‌ పట్టే సమయంలో రెండు మూడు సోయా

దొరికిన కాడికి దండుకుంటున్న హ‌మాలీలు.. రైతుల‌కు త‌ప్ప‌ని ఇబ్బందులు..!
X

దిశ‌, కుబీర్ : మండల కేంద్రంలోని సోయా కొనుగోలు కేంద్రంలో రైతులను హమాలీలు అందిన కాడికి దండుకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. సోయాలు జల్లెడ‌ పట్టే సమయంలో రెండు మూడు సోయా బస్తాలను ఒకేసారి కుమ్మరించి కింద చిల్లిపోయేలా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అమ్ముకోవడానికి వచ్చిన రైతు వెంబ‌డి తోడు ఎవ్వరు లేకపోతే పరేషాన్ చేస్తున్నారని వాపోతున్నారు. చివరగా మిగిలిన కొంత తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒకరిద్దరూ సంచుల్లో నింపుకొని వెళ్తుంటే, ఇంకొందరు దొరికింది దొరికినట్లు ఉడుచుకవెల్లి ఎక్కడి వాళ్ళు అక్కడే కుప్పలుగా పోసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఎలక్ట్రికల్ పవర్ ఉన్నా, మ్యాన్ పవర్ కొరతతో హమాలీలా ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందనీ పలువురు అంటున్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్ర‌త్యేక నిఘా పెట్టి ఇబ్బందులు కలగకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

Next Story