పులి సంచ‌రిస్తుంద‌ని ఏఐలో క్రియేట్ చేసిన వ్య‌క్తి అరెస్ట్

by Ratna Kumari |

దిశ‌, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా సీసీసీ టౌన్ షిప్ లో యూనియన్ బ్యాంకు సమీపంలో రాత్రి పెద్దపులి సంచరిస్తుందని సాయి కిరణ్

పులి సంచ‌రిస్తుంద‌ని ఏఐలో క్రియేట్ చేసిన వ్య‌క్తి అరెస్ట్
X

దిశ‌, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా సీసీసీ టౌన్ షిప్ లో యూనియన్ బ్యాంకు సమీపంలో రాత్రి పెద్దపులి సంచరిస్తుందని సాయి కిరణ్ అనే వ్యక్తి ఏఐ లో పెద్దపులి ఫోటో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పుకార్లు సృష్టించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు అటవీ క్షేత్ర అధికారి (ఎఫ్ఆర్ఓ) రత్నాకర్ రావు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాత్రంతా ఈ ప్రాంతంలో ఉండి వెతికినప్పటికీ ఎలాంటి పులి ఆనవాళ్లు కనిపించలేదన్నారు. సీసీసీ టౌన్ షిప్ లోకి పులి రాలేదని, ప్రజలు భయపడాల్సిన‌ అవసరం లేదని స్పష్టం చేశారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పులి ఫోటోను క్రియేట్ చేసి సంచరిస్తున్నట్టు పోస్ట్ చేసినట్టు తెలిపారు. ప్రజలను ఆందోళనలకు గురి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒకవేళ నిజంగా ఎవరికైనా పులి కనిపిస్తే అటవీశాఖ, పోలీసు అధికారులకు లేదా మీడియాకు తెలుపాలని అన్నారు. స్పష్టత లేని పుకార్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి కేసుల బారిన పడవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు డీఆర్ఓ ఆజార్, ఎఫ్ఎస్ఓ రామకృష్ణ సర్కార్, సతీష్ పాల్గొన్నారు.

Next Story