- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళ మరణానికి కారణమైన వ్యక్తి అరెస్ట్
దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని బజార్ హత్నూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో మంగళవారం

దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని బజార్ హత్నూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో మంగళవారం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్టు బోథ్ సీఐ గురుస్వామి తెలిపారు. సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. బజార్ హత్నూర్ గ్రామానికి చెందిన చేవుల రత్నమాల (48) నవంబర్ 9 న సాయంత్రం తన కుమారుడు చేవుల లక్ష్మణ్ (22) తో కలిసి వ్యవసాయ పనులు ముగించుకొని ఎద్దుల బండి పై గ్రామానికి వెళ్తోంది. అదే సమయంలో నిందితుడు తరడపు ప్రదీప్ కుమార్ తన కారు ( 23BH5470G) ను మద్యం మత్తులో అత్యంత నిర్లక్ష్యంగా, వేగంగా నడుపుతూ బజార్ హత్నూర్ గ్రామ శివారులో ఎద్దుల బండిని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బాధితురాలు చేవుల రత్నమాల గాయాలతో అక్కడికక్కడే మరణించింది. ఆమె కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దర్యాప్తు ద్వారా నిందితుడు మద్యం సేవించి వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో బోథ్ ఎస్ఐ శ్రీ సాయి, సిబ్బంది పాల్గొన్నారు.






