- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు
బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచులపూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.

X
దిశ, భీమిని : బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచులపూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. 108 ఆంబులెన్స్ ఈఎంటి సారయ్య తెలిపిన వివరాల ప్రకారం.. భీమిని మండలం వడాల గ్రామానికి చెందిన గుర్లె శివరాం అనే వ్యక్తి పని నిమిత్తం తాండూర్ మండలానికి వెళ్తున్న క్రమంలో అచులపూర్ గ్రామం వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో శివరాంకు ముఖం పై ముక్కు భాగాన తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108 కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రునికి ప్రథమ చికిత్స అందించి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. సరైన సమయంలో క్షతగాత్రుడినికి ఆసుపత్రికి తరలించిన 108 ఆంబులెన్స్ ఈఎంటి సారయ్య, పైలట్ తిరుపతిని ప్రజలు అభినందించారు.
Next Story






