- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహాలక్ష్మి పథకం మహిళలకు ఓ వరం..
మహాలక్ష్మి పథకం మహిళలకు ఓ వరం లాంటిది అని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు.

దిశ, ఆసిఫాబాద్ : మహాలక్ష్మి పథకం మహిళలకు ఓ వరం లాంటిది అని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్. టి. సి. ప్రయాణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాలక్ష్మి పథకం ప్రత్యేక కార్యక్రమంలో హాజరై ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా గత నెల 29వ తేదీ నాటికి జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు 77 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని చెప్పారు. చిన్నచిన్న వ్యాపారాలు, వీధి వ్యాపారాలు చేసే మహిళలు ఉచిత ప్రయాణం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని తెలిపారు. గతంలో ఏదైనా పని ఉన్నట్లయితే పురుషులు మాత్రమే వెళ్లేవారని, ఇప్పుడు మహిళలే ఆ పనులను పూర్తిచేసుకుని వస్తున్నారు. ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని ఈ పథకాన్ని అమలు చేస్తారని గుర్తు చేశారు. అంతకుముందు జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్. ఆర్డీవో లోకేశ్వర్ రావులతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఇండ్ల గణన పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.






