మత్తు వ్యసనాల నుండి విముక్తి కల్పించడమే లక్ష్యం

by Taduka Kalyani |

జిల్లాలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడంతో పాటు, వాటికి బానిసైన వ్యక్తులను సాధారణ జీవితంలోకి తీసుకురావడం లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ చర్యలు కొనసాగిస్తోంది.

మత్తు వ్యసనాల నుండి విముక్తి కల్పించడమే లక్ష్యం
X

దిశ,ఆదిలాబాద్ రూరల్: జిల్లాలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడంతో పాటు, వాటికి బానిసైన వ్యక్తులను సాధారణ జీవితంలోకి తీసుకురావడం లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ చర్యలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్థానిక రిమ్స్ ప్రాంగణంలో గల డి-అడిక్షన్ కేంద్రాన్ని మంగళవారం సందర్శించి అక్కడ అందిస్తున్న చికిత్సా విధానాలు, సౌకర్యాలను పరిశీలించారు. గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తులకు వైద్య సలహాలు, కౌన్సిలింగ్ ద్వారా చికిత్స అందిస్తూ వారిని ఆరోగ్యవంతమైన జీవన విధానంలోకి తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కుటుంబాలు, యువత తీవ్రంగా ప్రభావితమవుతున్నందున ప్రతి ఒక్కరూ వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఎస్పీ వెంట డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు కె నాగరాజు, కె స్వామి, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story