- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి..
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న డిమాండ్ చేశారు.

దిశ, ఉట్నూర్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు, సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉట్నూర్ మండల కేంద్రంలో ఐటీడీఏ కార్యాలయం ముందర బ్లాక్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందనీ ఈ నాలుగు లేబర్ కోడ్స్ అమలు అయితే కార్మికులు తమకు అందే హక్కులన్నీ కోల్పోతారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బ్లాక్ డే ను నిర్వహిస్తున్నామన్నారు. కార్మికులు కోరే గొంతమ్మ కోరికలు కావనీ, కనీస వేతనం 26వేల రూపాయలు అందించి, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కలిపించి, కార్మికుల ఇతర డిమాండ్స్ అన్నిటినీ పరిష్కారం చేయాలని, నాలుగు లేబర్ కోడ్స్‌ని రద్దు చేసి, విద్యుత్ సవరణ బిల్లు 2022 బిల్లును సైతం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రద్దు చేయని యెడల రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కోశాధికారి రత్నమాల, అంగన్వాడీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ముక్త, స్వర్ణలత, మండల నాయకులు పార్వతి, రేణుక, లక్ష్మి, సురేఖ, పద్మ, కళావతి, జయ, గ్రామపంచాయతీ యూనియన్ ఉట్నూర్ మండల కార్యదర్శి ఆత్రం సుందర్, మండల నాయకులు పూర్కా ప్రభు, భరత్ తదితరులు పాల్గొన్నారు.






