వృద్ధురాలి బలవన్మరణం

by Kema Shiva Kumar |

అనారోగ్యంతో ఓ వృద్ధురాలు మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడెం మండలం కల్లెడ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

వృద్ధురాలి బలవన్మరణం
X

దిశ, కడం: అనారోగ్యంతో ఓ వృద్ధురాలు మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడెం మండలం కల్లెడ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై కొసన రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లెడ గ్రామానికి చెందిన ఏనుగందుల శంకరవ్వ (60) వృద్ధురాలు గత నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆసుపత్రుల్లో చూయించుకున్నా వ్యాధి నయం కాకపోవడంతో మనస్తాపానికి గురైన శంకరవ్వ ఆదివారం ఉదయం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న కడెం ఎస్సై కోసన రాజు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story