- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడో విడత ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి
దిశ, మందమర్రి : గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికలు బుధవారం నిర్వహించనున్నారు. మందమర్రి మండలంలో పది గ్రామ పంచాయతీలు

దిశ, మందమర్రి : గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికలు బుధవారం నిర్వహించనున్నారు. మందమర్రి మండలంలో పది గ్రామ పంచాయతీలు ఉండగా.. శంకర్ పల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా వార్డు మెంబర్ ఎన్నికలు మాత్రమే జరుగుతాయి. మిగిలిన తొమ్మిది గ్రామ పంచాయితీల్లో సర్పంచ్, వార్డు పదవి ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో సర్పంచ్ అభ్యర్థులు మొత్తం ముప్పై(37) కాగా వార్డు సభ్యుల అభ్యర్థులు 165 పోటీలో ఉన్నారు. మొత్తం 80 పోలింగ్ కేంద్రంలో పోలింగ్ జరుగుతుంది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒకరు చొప్పున పది మంది రిటర్నింగ్ అధికారులు ఉండగా, 180 మంది పోలింగ్ సిబ్బందితో పాటుగా అన్ని గ్రామ పంచాయతీలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికలను పర్యవేక్షించడం కోసం మందమర్రి మండలములో మూడు జోనల్ అధికారులు కూడా ఉన్నారు. స్థానిక మోడల్ స్కూల్ లో మంగళవారం ఏర్పాటు చేసిన క్యాంపులో ఏసిపి రవికుమార్ పాల్గొని ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల జరిగే కేంద్రాల వద్ద పోలీసుల భద్రతా బలగాలు ఉంటాయి అని అన్నారు.మండల పరిషత్తు ఎన్నికల ఆఫీసర్ ఎంపిడివో రాజేశ్వర్, తహశీల్దార్ పి, సతీష్ కుమార్ శర్మ ఎలక్షన్స్ సెంటర్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎలాంటి ఫిర్యాదులు వచ్చిన సంబంధిత మండల స్థాయి అధికారులకు తెలిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, మండల స్థాయి అధికారులు,సిఐ శశిధర్ రెడ్డి పర్యవేక్షణలో మందమర్రి ఎస్సై ఎస్. రాజశేఖర్, రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ అదనపు ఎస్సై శ్రీనివాస్, ఏఎస్సై లు , ఆరోగ్య శాఖ, రెవెన్యూశాఖ, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.






