- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రుచి తీపి.. చేసేది కీడు !
ఢిల్లీ, బొంబాయి, హైదరాబాద్, రాజస్థాన్, గుజరాత్, భోగ్... ఇలా స్వీట్లు దుకాణ పేర్లతో కనిపించగానే వినియోగదారులు నోళ్లూరి విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు.

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఢిల్లీ, బొంబాయి, హైదరాబాద్, రాజస్థాన్, గుజరాత్, భోగ్... ఇలా స్వీట్లు దుకాణ పేర్లతో కనిపించగానే వినియోగదారులు నోళ్లూరి విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. తెర వెనుక జరుగుతున్న కల్తీ స్వీట్ల దందా అంతా ఇంతా కాదు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా కేంద్రాలైన ఆదిలాబాద్, నిర్మల్ మంచిర్యాల ఆసిఫాబాద్ సహా ఉమ్మడి జిల్లాలోని బైంసా, ఉట్నూరు, ఇచ్చోడ, బోథ్, బెల్లంపల్లి, కాగజ్ నగర్, చెన్నూరు, లక్షెట్టిపేట తదితర పట్టణ కేంద్రాల్లో విచ్చలవిడిగా కల్తీ స్వీట్ల దందా సాగుతున్నది.
నార్త్ టు సౌత్...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక వ్యాపారులు పెద్దగా స్వీట్ల వ్యాపారం చేయడం లేదు. ఉత్తర భారతం నుంచి వచ్చిన అనేకమంది వ్యాపారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని ఏళ్లుగా స్వీట్లు దుకాణాలు నడుపుతున్నారు. పెద్ద మొత్తంలో స్వీట్ల వ్యాపారాన్ని విస్తరించారు కూడా. రకరకాల స్వీట్ల పేరుతో అమ్మకాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, యూపీ, ఢిల్లీ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు స్థానికంగా పెద్ద మొత్తంలో స్వీట్లు దుకాణాలు విస్తరించి అమ్మకాలు చేస్తున్నారు.
చక్కెర స్థానంలో శాక్రీన్...
శాక్రీన్ అనే రసాయనాన్ని పెద్ద మొత్తంలో స్వీట్లు తయారీలో వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. వివిధ రకాల స్వీట్లలో చక్కెర బెల్లం ఆనకం తయారుచేసి వాటి ద్వారా స్వీట్లు తయారు చేయడం ఆనవాయితీ. అయితే స్వీట్లు తయారీకి చక్కెర బెల్లం నెయ్యి పాలు పెద్ద మొత్తంలో ఖర్చుతో కూడుకున్న వస్తువులు కావడంతో... స్వీట్ల వ్యాపారులు కల్తీ దందాకు అలవాటు పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శాక్రెన్ అనే రసాయన పదార్థం అత్యంత తీపి కలిగి ఉంటుందని చెబుతున్నారు. దీని వినియోగం కారణంగా వ్యాపారులకు భారీగా కలిసి వస్తుందని అంటున్నారు. దీన్ని వినియోగించిన తర్వాత తయారయ్యే స్వీట్లు తింటే అనేక రకాల రోగాలు వస్తాయన్న అభిప్రాయాలు వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. ఆహార తనిఖీ అధికారులు ఎప్పుడైనా ఫిర్యాదులు వస్తే మినహా రెగ్యులర్ తనిఖీలు చేయడం లేదు. దీనికి కారణం చూస్తే... ఆహార తనిఖీ శాఖకు అవసరమైన స్థాయిలో ఇన్స్పెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది లేరన్న విషయం వాస్తవం. దీనిపై ప్రభుత్వం దృష్టి సారిస్తే కల్తీ నిరోధించే అవకాశం ఉంది.






