ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వాలి..

by Kodari Anjali |

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డిమాండ్ చేశారు.

ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వాలి..
X

దిశ, ఉట్నూర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నేతావత్ రాందాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వెంకటాద్రి డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సోమవారం మండలంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ ఏపీవో జాదవ్ వసంతరావుకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అభివృద్ధి పేరుతో, పర్యావరణ పేరుతో, అడవుల సంరక్షణ పేరుతో, హరితహారం పేరుతో, గిరిజనుల భూములలో మొక్కలు నాటడం, కందకాలు తవ్వడం వంటి చర్యలతో పోడు రైతుల సాగు భూముల నుండి తరిమి వేయడానికి ప్రయత్నిస్తున్నరన్నారు. గిరిజనులకు 1/70, అడవి హక్కు చట్టాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. ప్రతి సంవత్సరం పోడు వ్యవసాయం చేసే గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు, పోలీస్ బలగాలుల దాడులతోనే వారికి తొలకరి ప్రారంభమవుతున్నదన్నారు.

రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్...

ఏజెన్సీ ప్రాంతంలో టైగర్ జోన్‌తో అనేక గ్రామాల ప్రజలను ప్రభుత్వాలు అనేక ఎత్తుగడులతో మభ్యపెట్టి గ్రామాలను ఖాళీ చేయించి ప్రజలను రోడ్డున పడేస్తున్నారని పేర్కొన్నారు. ఏజెన్సీలో ఏరియాలో గిరిజనులకు త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం, ఇందిరమ్మ ఇల్లు, రోడ్డు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు కుటికెల శంకర్, ఉపాధ్యక్షులు సిడం ధర్మం, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ధారంగుల ఎల్లయ్య, ఉపాధ్యక్షులు ఎనుముల నరసయ్య, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సంధ్యారాణి, జిల్లా నాయకులు బోడా కిషన్ రాజమౌళి, మల్లేష్ గౌడ్, ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ డిఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వాగ్మారీ సంబాజీ, అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సోయం జుగాధిరావు, జగిత్యాల జిల్లా అధ్యక్షులు గోపి చంద్రయ్య, నాయకులు మామిడి నాగరాజు, దుర్గం మల్లేష్, దుర్గం మున్నయ్య, దర్శనాల మల్లేష్, బాలసాని మల్లేష్ గౌడ్, వేడ్మా నాగరావు, కుడ్మేత భగవంతరావు, గుడికందుల రవి, సీట్ల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story