- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కౌటాలలో తుపాకుల కలకలం..!
దిశ, ఆసిఫాబాద్ : కౌటాలలో తుపాకీ కలకలం సృష్టించింది. ముఖ్యంగా ఓ వ్యాపారిని పిస్టల్ తో కాల్చి చంపేందుకు వెళ్తున్న ఓ వ్యక్తిని కౌటాల పోలీసులు అరెస్టు చేసినట్టు ఎస్పీ నితిక పంత్ తెలిపారు.

దిశ, ఆసిఫాబాద్ : కౌటాలలో తుపాకుల కలకలం సృష్టించింది. ముఖ్యంగా ఓ వ్యాపారిని పిస్టల్ తో కాల్చి చంపేందుకు వెళ్తున్న ఓ వ్యక్తిని కౌటాల పోలీసులు అరెస్టు చేసినట్టు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. మంగళవారం కౌటాల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని కౌటి- సాండ్గావ్ గ్రామానికి చెందిన కుర్బంకర్ అజయ్ సులువుగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో హిందీ సినిమాతో ప్రేరణపొందాడు. బాగా డబ్బున్న వారిని బెదిరించి భయపెట్టి అవసరమైతే చంపి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నాడు.అయితే 11.06.2025న రాత్రి సమయంలో బెదిరిస్తూ కౌటాలకు చెందిన ఓ వ్యాపారికి లేఖలు రాశాడు. రూ.50 లక్షలు ఇవ్వాలని లేకుంటే నీ కుటుంబ సభ్యులను చంపుతామని రెండు లెటర్లు రాసి సదరు వ్యాపారి ఫెర్టిలైజర్ షాప్ లో పెట్టాడు. కానీ ఆ వ్యాపారి స్పందించకపోవడంతో యూట్యూబ్ లో చూసి పిస్టల్, తపంచా లాంటి మారణాయుధాలు బీహార్ లో దొరుకుతాయని తెలుసుకుని.. జులై చివరి వారంలో బీహార్ వెళ్లి.. ఆగస్టు మొదటి వారం వరకు అక్కడే ఉండి బాబు సాహెబ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర రూ. 55 వేలు చెల్లించి ఒక పిస్టల్, రెండు మ్యాగజైన్లు దీనికి సంబంధించిన 20 బుల్లెట్లు, ఒక తపంచ, దీనికి సంబంధించిన ఒక బుల్లెట్ కొనుగోలు చేసి అక్కడే షూటింగ్ నేర్చుకున్నాడు. మూడు బుల్లెట్లు అక్కడే ప్రాక్టీస్ లో ఫైర్ చేసి ఖాళీ కోకలను తీసుకుని తన ఇంటికి వచ్చాడు.
ప్రాణహిత నది ఒడ్డున ఒక బుల్లెట్ గాలి లోకి ఫైర్ చేసి ప్రాక్టీస్ చేశారు. 26.9 2025న కాగజ్ నగర్ నుంచి మహారాష్ట్రకు వెళ్లే ట్రైన్ ఎక్కి అందులో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ తీసుకొని.. డబ్బులు ఇవ్వాలని వ్యాపారికి ఫోన్ చేశాడు. లేకుంటే చంపేస్తామని బెదిరించాడు. అయినా సదరు వ్యాపారి స్పందించకపోవడంతో 15.10.2025న రాత్రి గంటల ప్రాంతంలో వ్యాపారి తమ్ముడిని చంపాలని ఉద్దేశంతో పిస్టల్ లో రెండు బుల్లెట్లు నింపుకొని మార్గమధ్యలో వేచి చూసి.. వ్యాపారి తమ్ముడు రాగానే అతని ముఖం పై లైట్ ఫోకస్ పెట్టి అతను అని గ్రహించి ఒక బుల్లెట్ ఫైర్ చేశాడు. గురి తప్పడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఇదే క్రమంలో మంగళవారం ఉదయం సదరు వ్యాపారిని షాపులో నే హతమార్చాలనే ఉద్దేశంతో పిస్టల్ మూడు బుల్లెట్ తీసుకుని బైక్ పై వెళ్తుండగా మార్గమధ్యంలో ఎన్నికల తనిఖీ చేస్తున్న కౌటాల పోలీసులు నిందితుడ్ని పట్టుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అతని వద్ద నుంచి ఒక పిస్టల్, ఒక తపంచా (దేశి కట్ట), రెండు మ్యాగజిన్ లతో పాటు 15 చిన్న బుల్లెట్ లు, పెద్ద బుల్లెట్, ఐదు ఖాళీ కోకలు, సెల్ ఫోన్, ఒక బైకులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో డీఎస్పీ వహీదుద్ధీన్, కౌటాల సీఐ సంతోష్, ఎస్ఐ చంద్రశేఖర్, కాగజ్ నగర్ రూలర్ ఎస్ఐ సందీప్ ఉన్నారు.






