- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ఓటమికి కారణం అదే : ఏఐసీసీ పరిశీలకులు అజయ్ సింగ్
దిశ, ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీ పని తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకే సంఘటన్ శ్రుజన్ అభయాన్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ఏఐసీసీ పరిశీలకులు అజయ్ సింగ్ అన్నారు.

దిశ, ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీ పని తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకే సంఘటన్ శ్రుజన్ అభయాన్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ఏఐసీసీ పరిశీలకులు అజయ్ సింగ్ అన్నారు. అందరూ కలిసి గొప్పగా కార్యక్రమాన్ని నిర్వహించారని అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారీ దాకా భారత్ జోడో యాత్ర చేపట్టి రాహుల్ గాంధీ చారిత్రాత్మక ఘట్టాన్నిఆవిష్కరించారన్నారు. రానున్న బీహార్ హర్యానా లోనూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. మోదీ గత ఎన్నికలలో అబ్ కీ బార్ చార్ సౌ పార్ అన్నారని కాని కష్టం మీద 250 సీట్లు దాటాయన్నారు. నల్లధనాన్ని బయటికి తీస్తానని ప్రగల్భాలు పలికి కార్పోరేట్లకు కోట్ల రుణాలు మాఫీ చేసారన్నారు. అన్నం పెట్టే అన్నదాతకు మాత్రం రుణ మాఫీ చేయలేదని విమర్శించారు. 2004 లో కాంగ్రెస్ ఇక్కడ గెలిచిందని ఆ తర్వాత ఓటమికి నేతల మధ్య సఖ్యత లేకపోడమే అన్నారు. కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి కట్టుగా ఉంటే ఆదిలాబాద్ లో గత ఎన్నికలలో పార్టీ ఓడిపోయేదే కాదన్నారు. డీసీసీ అభ్యర్ది నియామకం విషయంలో అందరి అభిప్రాయం తీసుకుంటామని తెలిపారు. ఎవర్ని నియమిస్తే బాగుంటుందో చెప్పాలని కోరారు. అనంతరం మండలం, బ్లాక్, తాలూకా లెవల్లో అధ్యక్షుల నియామకం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, సంఘటన్ శ్రుజన్ అభియాన్ సమన్వయ కర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సీహెచ్ రాంభూపాల్, కార్యక్రమ కోఆర్డినేటర్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు జితేందర్, ఆదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి,డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ,ఏఐసీసీ మెంబర్ నరేష్ జాదవ్ , బోథ్ అసెంబ్లీ నియోజక వర్గ ఇంచార్జి ఆడె గజేందర్ పాల్గొన్నారు.






