బైంసాలో టెన్షన్..! టెన్షన్..! ముందుగానే మొదలైన శివరాత్రి జాగరణ..!

by Nallavelli.Anjaneyulu |

తమను చైర్మన్ చేస్తేనే ఎవరికైనా మద్దతు ఇస్తామని ఇండిపెండెంట్ అభ్యర్థిని బీబీ కుతిజా సిద్ధికా భర్త ఇద్రీస్ వెల్లడించారు.

బైంసాలో టెన్షన్..! టెన్షన్..! ముందుగానే మొదలైన శివరాత్రి జాగరణ..!
X

దిశ, భైంసా : తమను చైర్మన్ చేస్తేనే ఎవరికైనా మద్దతు ఇస్తామని ఇండిపెండెంట్ అభ్యర్థిని బీబీ కుతిజా సిద్ధికా భర్త ఇద్రీస్ వెల్లడించారు. పట్టణంలోని తన నివాసంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.. బైంసాలో ఎంఐఎం 12 కౌన్సిలర్ స్థానాలు సాధించిందని, ఇండిపెండెన్స్(5), బీజేపీ (6) కలిపి 11 కౌన్సిలర్స్ స్థానాలు సాధించిందని, భైంసా మున్సిపల్ పీఠాన్ని అధిష్టించాలంటే మ్యాజిక్ ఫిగర్ 14 కావాలని, అది బిజెపి,ఎంఐఎం రెండు పార్టీల వద్ద లేదని తమను ఎవరు మొదటగా రెండు సంవత్సరాలు చైర్మన్ పిఠనికి అవకాశం ఇస్తే వాళ్లకి తమ 24, 25వార్డులలో ఉన్న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఫారాన బేగం,బీబీ కుతిజా సిద్ధికా మద్దతు ఉంటుందని అన్నారు. ఇప్పటికే ఒకరు చివరి రెండు సంవత్సరాలు చైర్మెన్ పదవి ఇస్తామన్న తాము నిరాకరించినట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. తమకు నాలుగు సంవత్సరాలు వైస్ చైర్మెన్ పదవి ఇస్తామని ఏంఐఎం, బీజేపీ పార్టీ అభ్యర్థులు సంప్రదింపులు జరిపారని అన్నారు. తమ అభ్యర్థులు భైంసా మున్సిపాలిటీ లో 13 చోట్ల పోటీ చేసి, నాలుగు వేల పై చిలుకు ఓట్లు సాధించిందని, దాదాపు పలు వార్డులను సెకండ్ పొజిషన్ లో నిలిచిందని అన్నారు. బీజేపీ అధిష్టానం సైతం బైంసా మున్సిపాలిటీ పీఠంపై దృష్టి పెట్టిందని ఆ వైపుగా పావులు కదపడం కోసం మొదట అదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఎంపీ ఓటు రిజిస్టర్ అయిందని ప్రచారం సాగగా..చివరి క్షణంలో ఆగమేగాల మీద దాన్ని బైంసా బల్దియా పీఠం కైవసం కోసం ఇక్కడికి మార్చినట్లు తెలిసింది. ఫలితాలు వెలుబడిన నాటి నుంచి చైర్మన్ పీఠం సమీకరణాలు ఏ విధంగా ఉంటాయోనని,గమనిస్తున్న ప్రజలకి ముందుగానే శివరాత్రి జాగరణ స్టార్ట్ అయిందని పలువురు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా రేపటి వరకు చైర్మన్ పీఠం ఎవరు అధిష్టిస్తారని వేచి చూడాల్సిందే..!

Next Story