- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదిలాబాద్ లో ఉద్రిక్తత..
దిశ, ఆదిలాబాద్ : నేషనల్ హెరాల్డ్ కేసు సాకుతో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా వే

దిశ, ఆదిలాబాద్ : నేషనల్ హెరాల్డ్ కేసు సాకుతో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా వేధిస్తోందని ఆరోపిస్తూ ఆదిలాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ నాయకత్వంలో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ముఖ్య నాయకులను పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసులో గత పదేళ్లుగా అక్రమ కేసులతో బీజేపీ ప్రభుత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీని వేధించిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను బీజేపీ వారి గుప్పిట్లో పెట్టుకొని అక్రమ కేసులను బనయిస్తుందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో క్లీన్ చీట్ కేసులతో భయపెట్టాలని చూస్తుందన్నారు. ఇందులో మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, మాజీ ఎంపీ సోయం బాపూరావు, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య పాల్గొన్నారు.






