- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు : షబ్బీర్ అలీ
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబ్బీర్ అలీ హాజరై ముందుగా ఎన్టీఆర్ చౌక్ లోని అమరవీరుల స్థూపం, జయశంకర్ విగ్రహం వద్ద నివాళులర్పించి అనంతరం కలెక్టరేట్ ఆవరణ లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

దిశ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబ్బీర్ అలీ హాజరై ముందుగా ఎన్టీఆర్ చౌక్ లోని అమరవీరుల స్థూపం, జయశంకర్ విగ్రహం వద్ద నివాళులర్పించి అనంతరం కలెక్టరేట్ ఆవరణ లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా వివరించారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పలువురు రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాల పునాదులపై, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నదని అన్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల స్పూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు.సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.నార్నూర్ అస్పిరేషనల్ బ్లాక్ లో అత్యుత్తమ సేవలు అందించిన వివిధ శాఖల అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు.ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి,ఎమ్మెల్యే పాయల్ శంకర్, అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు..
త్వరలోనే జర్నలిస్టులు శుభవార్త వింటారని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు.రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..జర్నలిస్టులకు త్వరలోనే ఇళ్ల స్థలాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.






