ఆన్ లైన్ బెట్టింగ్ స్థావ‌రం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి

by Ratna Kumari |

దిశ, ఆసిఫాబాద్ : ఆన్ లైన్ బెట్టింగ్ స్థావరం పై టాస్క్ పోర్స్ పోలీసులు దాడిలో ఐదుగురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేయ‌డంతో పాటు వారి వ‌ద్ద రూ.65వేలు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ సీఐ రాణా

ఆన్ లైన్ బెట్టింగ్ స్థావ‌రం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి
X

దిశ, ఆసిఫాబాద్ : ఆన్ లైన్ బెట్టింగ్ స్థావరం పై టాస్క్ పోర్స్ పోలీసులు దాడిలో ఐదుగురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేయ‌డంతో పాటు వారి వ‌ద్ద రూ.65వేలు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. దహేగాం మండలంలోని ఐనాం గ్రామ శివారులో కొందరు యువకులు టోకెన్ పద్ధతిలో ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేయగా వారినుంచి 1 నుంచి 100 టోకెన్లను ఉపయోగిస్తూ జూదాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ​వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో లైవ్ వీడియోలు పోస్ట్ చేస్తూ తమ టోకెన్లకు పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ వస్తుందని ప్రజలను నమ్మించి, ఆశ చూపించి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు.​ ఒక టోకెన్‌ను సుమారు రూ. 1000 చొప్పున అమ్ముతున్నారని తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.65 వేల 270 నగదు, 5 మొబైల్ ఫోన్లు, స్టీల్ బాక్స్, టోకెన్లు స్వాధీనం చేసుకుని పెరుగు వినోద్, మసా హరీదాస్. ​జుమ్మిడి వసంత్, కొండగుర్ల నాగేందర్, దుర్గం వెంకటేశ్ అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

Next Story