భార్య హత్య కేసులో భర్త అరెస్టు..

by Bhanu |   (  Updated:2025-07-04 09:43:38  IST  )

భార్యను హత్య చేసిన కేసులో నిందితుడిని కన్నెపల్లి పోలీసులు అరెస్టు చేశారు.

భార్య హత్య కేసులో భర్త అరెస్టు..
X

దిశ, తాండూర్ : భార్యను హత్య చేసిన కేసులో నిందితుడిని కన్నెపల్లి పోలీసులు అరెస్టు చేశారు. తాండూర్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో కేసు వివరాలను సీఐ కుమారస్వామి వెల్లడించారు. మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం మెట్టుపల్లి గ్రామానికి చెందిన ముడిమడుగుల తిరుపతికి తులసితో వివాహం జరిగింది. తిరుపతి కూలి పని చేస్తూ భార్య, నాలుగు సంవత్సరాల కూతుర్ని పోషిస్తున్నాడు. తన భార్య తులసి(35) వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త తిరుపతి అనుమానిస్తూ కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు.


భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. గత బుధవారం రాత్రి తిరుపతి మద్యం సేవించి భార్య తులసితో గొడవపడ్డాడు. ఇంట్లో తులసి నిద్రిస్తుండగా మద్యం మత్తులో గురువారం తెల్లవారుజామున గొడ్డలితో తులసి మెడపై నరికాడు. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. ఈ సమావేశంలో కన్నేపల్లి ఎస్సై గంగారం పాల్గొన్నారు.

Next Story