- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్ ల ఆత్మహత్యలు
by Ratna Kumari |
దిశ, ఆసిఫాబాద్ : బీఆర్ఎస్ హాయాంలో సర్పంచ్ లు చేసిన పనులకు బిల్లులు రాక.. చేసిన అప్పులు తీరక సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకున్నారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆరోపించారు.

X
దిశ, ఆసిఫాబాద్ : బీఆర్ఎస్ హాయాంలో సర్పంచ్ లు చేసిన పనులకు బిల్లులు రాక.. చేసిన అప్పులు తీరక సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకున్నారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆరోపించారు. సోమవారం తిర్యాణీ మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలకు అభివృద్ధి శూన్యమన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసి వేల కోట్ల రూపాయలు కుడా బెట్టుకున్నారని వాపోయారు. కొత్త జీపీలను ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడ అభివృద్ధి చేయలేదని ఎద్దేవా చేశారు. మాది ప్రజా ప్రభుత్వం.. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమం కోసం మా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, మా ముఖ్యమంత్రి పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 శాతం సీట్లు గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Next Story






