ఫిట్స్ తో విద్యార్థి మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, భీమిని : ఫిట్స్ వ‌చ్చి విద్యార్థి మృతి చెందిన ఘ‌ట‌న మంచిర్యాల జిల్లా భీమిని మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. భీమిని మండ‌ల కేంద్రంలోని కురుమ‌వాడ‌కు చెందిన చిర్రం తిరుప‌తి,

ఫిట్స్ తో విద్యార్థి మృతి
X

దిశ‌, భీమిని : ఫిట్స్ వ‌చ్చి విద్యార్థి మృతి చెందిన ఘ‌ట‌న మంచిర్యాల జిల్లా భీమిని మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. భీమిని మండ‌ల కేంద్రంలోని కురుమ‌వాడ‌కు చెందిన చిర్రం తిరుప‌తి, ప‌ద్మ దంప‌తుల కుమారుడు కార్తీక్(14), జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఆదివారం గ్రామ శివారులో ఉన్న వాగు వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. ఫిట్స్ రావడంతో వాగు నీటిలో పడి మృతి చెందినట్లు తెలిపారు. కార్తీక్ కి 7 సంవ‌త్స‌రాల వయసు నుంచి ఫిట్స్ తో బాధ‌ప‌డుతున్నాడు. నెల రోజుల నుంచి పాఠశాలకు వెల్తూ.. కింద పడి పోవడంతో కొద్దిరోజులుగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఆదివారం సమీప వాగుకు బహిర్భూమికి వెళ్లి వాగులో పడి మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న‌ట్టు భీమిని ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు.

Next Story