- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పది పరీక్షకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ సురేష్ కుమార్
by Kema Shiva Kumar |
పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని పీ.టీ.జీ బాయ్స్, జూనియర్ కాలేజ్, జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాల పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

X
దిశ, బెజ్జుర్: పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని పీ.టీ.జీ బాయ్స్, జూనియర్ కాలేజ్, జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాల పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ గురించి సంబంధిత అధికారిని అడిగి తెలుసుకున్నారు. పరీక్ష నిర్వహణ సిబ్బంది, పోలీస్ సిబ్బందికి మొబైల్ ఫోన్స్ లోనికి అనుమతి లేదని ఎస్పీ గారు తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నందున, ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసు అధికారులకు తెలియజేయాలని పరీక్ష నిర్వహణ సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వర రావు, ఆసీఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్, కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్, ఆసీఫాబాద్ సీఐ రాణా ప్రతాప్ పాల్గొన్నారు.
Next Story






