- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు..
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ పోలీస్ అధికారులను ఆదేశించారు.

దిశ, ఆసిఫాబాద్ : శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్ లో పెండింగ్ కేసులు లేకుండా చూడాలన్నారు. పోలిస్ స్టేషన్ పరిధిలో రాత్రుల్లో పెట్రోలింగ్ పెంచాలని, బెట్టింగ్, జూదం, మట్కా, గంజాయిలతో పాటు పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెంచాలని ఆదేశించారు. 100 కాల్ తో పాటు ప్రజలు ఫిర్యాదుకు తక్షణమే స్పందించి, న్యాయం చేయాలని సూచించారు. అలాగే ప్రజలకు సీసీ కెమెరాల ఏర్పాటు, సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలని చెప్పారు. కాగా వచ్చే హనుమాన్ జయంతి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ చిత్తరంజన్. డీఎస్పీ వాహిదుద్దీన్ తదితరులు ఉన్నారు.






