- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాల్య వివాహాల పై చట్టపరమైన చర్యలకు కసరత్తు
బాల్య వివాహాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీవో బుర్ల మహేష్ శుక్రవారం చెప్పారు.

దిశ, ఆసిఫాబాద్ : బాల్య వివాహాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీవో బుర్ల మహేష్ శుక్రవారం చెప్పారు. ఆసిఫాబాద్ మండలంలోని రహపల్లి గ్రామంలో మైనర్ అమ్మాయికి బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న వెంటనే, సంబంధిత గ్రామానికి వెళ్లి బంధువులు, కుటుంబ సభ్యులు, కుల పెద్దలకు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. వివాహాన్ని ప్రోత్సహించిన వారిపై కేసులు నమోదవుతాయని, చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయని వారిని కౌన్సిలింగ్ ద్వారా హెచ్చరించారు.
జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన కోసం కట్టుబడి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్న డీసీపీవో, బాల్య వివాహాలు జరిపితే రెండు సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించడంతో పాటు నాన్-బైలబుల్ కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే 1098 టోల్ ఫ్రీ నెంబర్ లేదా 112 కు వెంటనే సమాచారం ఇవ్వమని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ ప్రవీణ్ కుమార్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ బాల్ ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.






