కొమురం భీం జిల్లాలో విచిత్ర సంఘ‌ట‌న

by Ratna Kumari |

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మూగజీవాల ప్రేమకు సరిహద్దులు లేవని ఓ ఆవు నిరూపించింది.

కొమురం భీం జిల్లాలో విచిత్ర సంఘ‌ట‌న
X

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మూగజీవాల ప్రేమకు సరిహద్దులు లేవని ఓ ఆవు నిరూపించింది. సిర్పూర్ టి మండలంలోని ఇటీక్యాల పహడ్ గ్రామంలో ఆకలితో అలమటిస్తున్న మేకపిల్లను చూసి ఆవు క‌నిక‌రించింది. జాతి భేదం చూడకుండా మేకపిల్లకు పాలిచ్చే కడుపు నింపింది. ఈ హృదయ విదారక దృశ్యం స్థానికులను ఎంతగానో కదిలించింది. మాతృత్వానికి కులమతాలే కాదు.. జీవరాశి భేదాలు కూడా ఉండవని ఈ ఘటన చాటిచెప్పింది.

Next Story