తుమ్మిడిహట్టిపై దూకుడు.. త్వరలోనే మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం

by velandi.Saikiran |   (  Updated:2026-05-08 20:00:43  IST  )

ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పై సర్కారు దూకుడుగా ముందుకు వెళుతున్నది.

తుమ్మిడిహట్టిపై దూకుడు.. త్వరలోనే మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం
X

ప్రాణహిత.. ప్రగతి జాతర..

• తుమ్మిడిహెట్టిపై సర్కార్ దూకుడు

• త్వరలోనే మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం

• తూర్పు జిల్లా రైతులకు సాగునీటి పండుగ

• ఉమ్మడి జిల్లాపై చెరగని ముద్రకు సీఎం భారీ స్కెచ్

దిశ ప్రతినిధి, నిర్మల్ : ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పై సర్కారు దూకుడుగా ముందుకు వెళుతున్నది. గత కాంగ్రెస్ హయాంలో శంకుస్థాపన చేసిన ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు కు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం లోని తుమ్మిడి హెట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కే సీ ఆర్ సీఎం అయిన వెంటనే ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు ను రద్దు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మరుగున పడింది.

రేవంత్ పట్టుదలతో మళ్లీ ‘ప్రాణం’హిత

కేసీఆర్ హయాంలో మరుగున పడ్డ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన తుమ్మిడి హెట్టి బహులార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణం మళ్లీ తెర పైకి వచ్చింది. గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 100 టీఎంసీల నీటిని తరలించే విధంగా భారీ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం తుమ్మిడి హెట్టి వద్ద చేపట్టేందుకు మళ్లీ రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన పాత డిపిఆర్ ఫైలు దుమ్ము దులుపుతున్నది. తాజా గా కొన్ని మార్పు, చేర్పులు చేసి కొత్తగా ప్రాజెక్ట్ నిర్మాణంపై సర్కారు సీరియస్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

తూర్పు జిల్లాకు భారీగా మేలు

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం గతంలో ఖరారు చేసిన స్థలం వద్ద చేపడితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతానికి భారీగా మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు ప్రధానంగా సిర్పూర్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని మూడు మండలాలు బెల్లంపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాలు మంచిర్యాల నియోజకవర్గం లోని రెండు మండలాలు చెన్నూరు నియోజకవర్గంలోని మరో మూడు మండలాలకు భారీగా సాగునీరు అంటే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 150 అడుగుల పొడవుతో ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే మరింత ఎక్కువగా మేలు జరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు తూర్పు జిల్లా లో ఉన్న పలు నియోజకవర్గాల రైతాంగానికి సాగునీరు అందించడంతోపాటు గోదావరి నదిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టుకుఏటా 100 టీఎంసీలపైగా నీరు అందించే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన సాగునీటి ప్రాజెక్టును ఆదిలాబాద్ జిల్లా రైతు రైతన్నకి అందించినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఈ నిర్మాణంతో రేవంత్ రెడ్డి ముద్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం తో పాటు ఎల్లంపల్లి ద్వారా దిగువన ఉన్న కరీంనగర్ మెదక్ జిల్లాల రైతాంగానికి కూడా పడుతుందని చెబుతున్నారు.

సీఎం సహా మంత్రులు త్వరలోనే మహారాష్ట్రకు...

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా జిల్లాకు చెందిన మంత్రి వివేక్ వెంకటస్వామి ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తదితరులు త్వరలోనే మహారాష్ట్రకు ఒక కార్యక్రమాన్ని కూడా ఖరారు చేసినట్లు తెలిసింది మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పట్నవిస్ తో సమావేశం కానున్నారు. ప్రణహిత నదిపై నిర్మించి తలపెట్టిన ప్రాజెక్టు కోసం మహారాష్ట్రతో తగవులు లేకుండా ఒప్పందం కుదురుచుకునేందుకు ఈ పర్యటన ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ నెలలోనే ఈ టూర్ ఉంటుందని కూడా సమాచారం. రాజా పరిస్థితులు చూస్తుంటే రేవంత్ సర్కారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు సాధన విషయంలో దూకుడుగా వెళుతున్నప్పుడు స్పష్టం అవుతున్నది.

Next Story