మున్సిపల్ 'ముందస్తు' హంగామా

by velandi.Saikiran |

ఫిబ్రవరిలో మునిసిపల్ ఎలక్షన్స్ పోరు ఉంటుందన్న నేపథ్యంలో, ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు అవ్వగా...పోటీ అభ్యర్థులు వార్డులలో తమ స్టంట్లను మొదలుపెట్టారు.

మున్సిపల్ ముందస్తు హంగామా
X

దిశ, భైంసా: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రిజర్వేషన్ ఖరారు ప్రక్రియ పూర్తికాగా...నిర్మల్ జిల్లాలో ఇప్పటికే పోటీలో ఉండాలని తలిచే అభ్యర్థులు రాజకీయ క్రీడాలు మొదలుపెట్టారు. తాము పోటీ చేయాలనుకుంటున్న వార్డులోని ఓటర్స్ కి కొందరు పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఫోన్ చేస్తూ..! ఫీడ్ బ్యాక్ తీసుకునే పనిలో పడ్డారు.మరికొందరు సంబంధిత వార్డులలో పోటీలో ఉంటా, ఆశీర్వదించండి..! అని సామాజిక మాధ్యమాలలో పోస్ట్లు సైతం పెడుతున్నారు. అయితే రిజర్వేషన్లు ఖరారు అవ్వడంతో మున్సిపాలిటీ రాజకీయం మరింత ఊపు అందుకుంది.జిల్లా లో ఖానాపూర్,నిర్మల్,బైంసా ఇలా అన్నీ కేంద్రాలలో రాజకీయ హంగామా మొదలైంది.

బల్దియా బరికి సన్నద్ధమవుతున్న ప్రధాన పార్టీలు

బల్దియా ఎన్నికల పోటీలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు సన్నద్ధమవుతున్నాయి. పట్టణలలో మున్సిపల్ ఎన్నికల రాజకీయ రాజీ రాజకుంది.ఇప్పటికే ఓటరు సవరణ ముసాయిదా జాబితా రావడం,రిజర్వేషన్లు ఖరారు అవ్వడంతో జిల్లాలో నిర్మల్,బైంసా, ఖానాపూర్ మున్సిపల్ పోల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్,బిజెపి,బిఆర్ఎస్,ఎంఐఎం గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించుకుంటున్నాయి.పోటీ అభ్యర్థులు పలు ప్రధాన పార్టీల నాయకులను కలుస్తూ టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. మరోపక్క కొందరు ఇండిపెండెంట్ గా పోటీ చేసే అభ్యర్థులు,పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో ఫామ్లో ఉన్నటువంటి శిండే శివసేన పార్టీ బి ఫామ్ లు తీసుకొచ్చే యోచనలో వున్నారు.గతనెలలో పూర్తయిన పంచాయతీ ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పార్టీలు మున్సిపల్ పోల్ కు సన్నద్ధమవుతున్నాయి.జిల్లాలో మూడు విడతల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీలు పోటాపోటీగా సర్పంచ్ స్థానాలు గెలిపించుకోగా బీ.ఆర్.ఎస్ ఖానాపూర్ నియోజకవర్గంలోనే కొంతమేరకు ప్రభావం చూపగలిగింది.ఈ ఫలితాల ఆధారంగా ఆయా పార్టీలు మున్సిపాలిటీల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న లెక్కలు వేసుకుంటున్నాయి.

మున్సిపాలిటీల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ఫోకస్

నిర్మల్ తో పాటు భైంసా,ఖానాపూర్ మున్సిపాలిటీలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్టణాలలో సైతం గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లా అధ్యక్షుడు వెడ్మబొజ్జు పటేల్ ఇప్పటికే పార్టీ ప్రధాన నాయకులు కార్యకర్తలతో ఎన్నికలపై చర్చించగా, ఇటీవల నిర్మల్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి హాజరవ్వగా ఆ పర్యటన సైతం కాంగ్రెస్కి ప్లస్ అవుతుందని కాంగ్రెస్ వర్గీయిలు భావిస్తున్నారు.ఈ మేరకు తాలూకా ఇన్చార్జిలు పటిష్టంగా పనిచేసి, బల్దియాలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.నిర్మల్,ముధోల్ నియోజకవర్గాల్లో స్థానిక ఫలితాల్లో పార్టీకి కొంత తక్కువ స్థానాలు రావడంతో జిల్లాకేంద్రంతో పాటు భైంసా పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా దృష్టిపెట్టాలని యోచన చేస్తున్నట్టు తెలిసింది.

పంచాయతీ ఫలితాలను మున్సిపాలిటీలలో నిలపాలని చుస్తున్న బిజెపి

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నిర్మల్,ముధోల్ తాలుకాలలో బీజేపీ ఎన్నడూ లేనివిధంగా గణనీయంగా సర్పంచులను గెలుచుకుoది. ప్రస్తుతం ఇవే ఫలితాలను పట్టణ మున్సిపాలిటీలను సైతం కైవసం చేసుకోవాలని ఆరాటపడుతోంది.ప్రస్తుతం నిర్మల్,ముధోల్ తాలూకా ఎమ్మెల్యేలుగా బిజెపి అభ్యర్థులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి,పవర్ రామారావు పటేల్ కోనసాగగా,ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎం.పీ గోడెం నాగేష్ సైతం బిజెపినే.ఈ అవకాశాలన్నీ బిజెపి బల్దియా పీఠలు దక్కించుకోవడానికి ఉపయోగపడతాయని లెక్కలు వేసుకుంటుంది. గతంలో 26 వార్డులున్న భైంసా మునిసిపాలిటీలో తొమ్మిది వార్డ్ కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకున్న బిజెపి,ఈసారి ఎలాగైనా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వరుసగా గత రెండు దాఫాలుగా ఎంఐఎం ఇక్కడ అధికారం సాధించడంతో,ఆ ఫలితం తిరిగి పునరావృతం కాకుండా బిజెపి యే మున్సిపాలిటీ పీఠం అది నిర్వహించే విధంగా బీజేపీ నాయకులు పావులు కదిపే పనిలో పడ్డారు.

గత వైభవం కోసం బీఆర్ఎస్

ఈ సారి జిల్లాలోని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు బీఆర్ఎస్ బలంగానే ప్రయత్నిస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జి జాన్సన్నాయక్ క్రియాశీలకంగా పనిచేస్తుండటంతో చెప్పుకోదగ్గ సర్పంచ్ స్థానాలను ఆపార్టీ దక్కించుకుంది.నిర్మల్, ఖానాపూర్ తోపాటు,పొత్తులు పెట్టుకోనైనా భైంసాను గెలుస్తామన్న ఆశాభావంతో బీఆర్ఎస్ నేతలు పురపోరుకు సన్నద్ధమవుతున్నారు.

గెలుపే లక్ష్యంగా,బల్దియాల కైవసం కోసం ఎంఐఎం దృష్టి

గత మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను బెరుజివేసుకుని,వాటిని అధిగమిస్తూ,జిల్లాలోని బల్దియాలో మరింత బలపడేందుకు ఎం.ఐ.ఎం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది.గత కొన్ని దఫాలుగా భైంసా పుర పోరులో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటున్న ఎంఐఎం ఈసారి దఫా లో సైతం గెలుపు ప్రయత్నంగా లెక్కలు వేసుకుంటుంది.అయితే నిర్మల్, ఖానాపూర్ బల్దియాలో సైతం అత్యధిక సీట్లు రాబట్టుకోవడంపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

ఇండిపెండెంట్ గా రాణించాలని కొందరు

పలు పార్టీలలో పోటీ చేసే నాయకులు అధికంగా ఉన్న నేపథ్యంలో,తమకు పోటీ చేయడానికి అవకాశం రాని యెడల ఇండిపెండెంట్ గా నైనా పోటీ చేయడానికి పలువురు పోటీ అభ్యర్థులు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే బైoసా లాంటి ప్రాంతంలో కొందరు పోటీ అభ్యర్థులు మహారాష్ట్రలో పాపులర్ పార్టీ అయినటువంటి షిండే శివసేన పార్టీ బీ ఫాంలు తీసుకొచ్చి, పోటీ చేయాలని యోచనలో ఉన్నారు. ఏదేమైనా ఈసారి మునిసిపల్ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించుకుంటూ ముందుకు సాగుతున్నాయి.

వార్డులలో ఇప్పటికే పోటీ నాయకుల స్టంట్స్

ఫిబ్రవరిలో మునిసిపల్ ఎలక్షన్స్ పోరు ఉంటుందన్న నేపథ్యంలో, ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు అవ్వగా...పోటీ అభ్యర్థులు వార్డులలో తమ స్టంట్లను మొదలుపెట్టారు. తాము పోటీ చేయాలనుకునే వార్డులలో ప్రజలని కలుస్తూ,వార్డులలో నెలకొన్న సమస్యలను మా గెలుపుతో నిర్మూలిస్తామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు.

Next Story