సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ కాంతిలాల్ పాటిల్

by Ratna Kumari |

దిశ‌, ఆసిఫాబాద్ : సైబ‌ర్ నేరాల ప‌ట్ల జిల్లా ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. తాజాగా మ‌రో సైబ‌ర్ నేర‌గాడిని అరెస్ట్ చేసిన‌ట్టు త‌న‌ కార్యాల‌యంలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

సైబర్ నేరాల పట్ల  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ కాంతిలాల్ పాటిల్
X

దిశ‌, ఆసిఫాబాద్ : సైబ‌ర్ నేరాల ప‌ట్ల జిల్లా ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. తాజాగా మ‌రో సైబ‌ర్ నేర‌గాడిని అరెస్ట్ చేసిన‌ట్టు త‌న‌ కార్యాల‌యంలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 2025 జూన్ 24 నుంచి వాట్సాప్ ఆన్ లైన్ లింక్ పంపి రూ.1ల‌క్ష‌66వేలు సైబ‌ర్ నేర‌గాళ్లు కాజేసిన‌ట్టు ఆసిఫాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. డీఫోర్ సి బృందానికి బాధితుడి డబ్బులు లావాదేవీలు జరిగిన బ్యాంకు అకౌంట్ ద్వారా గుజరాత్ రాష్ట్రానికి చెందిన పంకజ్ లాలజీ భాయ్, శైలేష్ సల్లు భాయ్ లను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. తాజాగా బుధవారం ఈ కేసులో గుజరాత్ కు చెందిన సైబర్ నేరస్తుడు మిథుల్ భాయ్ ను అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్ల‌డించారు. సైబర్ నేరాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అనవసరమైన లింకులు, ఉచిత ప్రకటనలు, ఉద్యోగం పేరిట వచ్చే ఫోన్ కాల్ జనాలు స్పందించి నష్టపోవొద్దుని హెచ్చరించారు.

Next Story