- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం కలగాలి : ఎస్పీ అఖిల్ మహాజన్
దిశ, ఉట్నూర్ : ప్రజల్లో పోలీసు పట్ల నమ్మకం పెంచే విధంగా విధుల నిర్వహణ చేపట్టాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం ఉట్నూర్ పోలీస్ స్టేషన్ ను అదనపు ఎస్పీ కాజల్ సింగ్ తో కలసి ఎస్పీ త

దిశ, ఉట్నూర్ : ప్రజల్లో పోలీసు పట్ల నమ్మకం పెంచే విధంగా విధుల నిర్వహణ చేపట్టాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం ఉట్నూర్ పోలీస్ స్టేషన్ ను అదనపు ఎస్పీ కాజల్ సింగ్ తో కలసి ఎస్పీ తనిఖీ చేశారు. ఎస్పీరాకతో పోలీసులు స్వాగతం పలికారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న వాహనాలను పరిశీలించారు. ప్రజల పిర్యాదులు స్వీకరణ, రికార్డుల పరిశీలించారు. కేసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ సిబ్బంది యొక్క కిట్ ఆర్టికల్స్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కి కేటాయించిన పోలీసు సామాగ్రిని వస్తువులను వాటి నిర్వహణను పరిశీలించారు. అంతకుముందు స్టేషన్ ఆవరణలో సిబ్బందికి మాబ్ ఆపరేషన్ డ్రిల్ పై తగు సూచనలు జారీ చేశారు. ఆవరణను పరిశీలించి పరిశుభ్రతను కలిగి ఉండాలని, పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదు దారుల పట్ల బాధ్యతగా వ్యవహరించి వారి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని ఎస్పీ అన్నారు. పోలీసుల గౌరవం పెంచేలా విధుల నిర్వహణ చేపట్టాలని, శారీరక దృఢత్వం శారీరక వ్యాయామం ఆరోగ్యానికి కీలకమన్నారు. పిటిషన్ ఎంక్వయిరీ సంబంధిత విపిఓ ద్వారా నిర్వహించాలని, విలేజ్ పోలీస్ ఆఫీసర్ విధానాన్ని సక్రమంగా అమలు చేస్తూ సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల సమాచారమైన క్షణాల వ్యవధిలో పోలీసులకు సమాచారం అందించేలా నిఘా వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కేసుల దర్యాప్తు, కోర్టుల నందు పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు, సమన్లు, వారెంట్లు పెండింగ్లో ఉన్న వాటిని సరైన సమయంలో పూర్తి చేయాలని, రాత్రి సమయాలలో గస్తీ నిర్వహిస్తూ ఆర్థిక నేరాలను అరికట్టే విధంగా విధుల నిర్వహణ చేపట్టాలన్నారు. రాత్రి సమయాలలో ఫింగర్ ప్రింట్ యంత్రం ద్వారా తనిఖీ నిర్వహిస్తూ అనుమానస్పద వ్యక్తుల వేలిముద్రలను సేకరించాలని సూచించారు. ఆర్థిక నేరాలు జరిగిన కేసులలో దర్యాప్తు పూర్తి దొంగలను పట్టుకొని, కేసుల నందు రికవరీ చేసి బాధితులకు సరైన న్యాయం చేపట్టాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, గుడుంబా, గాంబ్లింగ్ లాంటివి నిర్వహించకుండా అరికట్టాలని సూచించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు సమాచారాన్ని తెలుసుకుంటూ, ప్రజారక్షణలో తమ వంతు పాత్ర పోషించాలన్నారు. ఎస్పీ వెంట ఉట్నూర్ అదనపు ఎస్పి కాజల్ సింగ్, ఉట్నూర్ సీఐ, ఎస్సై మడావి ప్రసాద్, ఎస్సై కె ప్రవీణ్ కుమార్ ఉన్నారు.






