ఆదివాసీల సంస్కృతి చాలా గొప్ప‌ది : ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, భీంపూర్ : ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు గొప్పవని భవిష్యత్ తరాలకు వాటిని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బుధవారం

ఆదివాసీల సంస్కృతి చాలా గొప్ప‌ది :  ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్
X

దిశ‌, భీంపూర్ : ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు గొప్పవని భవిష్యత్ తరాలకు వాటిని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బుధవారం భీంపూర్ మండలంలోని భగవాన్ పూర్ గ్రామస్థుల ఆహ్వానం మేరకు ఆయన గుస్సాడీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ కి గ్రామస్థులు సంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం గుస్సాడీ ప్రదర్శనలను తిలకించారు. పటేల్, మహాజన్ లతో మాట్లాడి వారి ఆచార, వ్యవహారాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గుస్సాడీ ఆడి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసీ, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరు మూఢ నమ్మకాలు విడనాడాలని సూచించారు. అలాగే నాటు వైద్యం, దొంగ బాబాలను అస్స‌లు నమ్మవద్దన్నారు. పిల్లలను చక్కగా చదివించాలని సెలవులు అయిన‌ వెంటనే పాఠశాలలకు పంపించాలని కోరారు. మద్యం, గంజాయి వంటి అలవాట్లుకు దూరంగా ఉండాలన్నారు. తనను ఆహ్వానించిన గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంత‌రం గ్రామంలో ఉన్న క‌రెంట్ స‌మ‌స్య‌ను ఎస్పీ దృష్టికి తీసుకెళ్ల‌గా.. ఎస్ఈతో మాట్లాడ‌తాన‌ని హామీ ఇచ్చారు ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్. ఈ కార్యక్రమంలో ఆయన వెంట DSP జీవన్ రెడ్డి, CI శ్రవణ్, SI విక్రమ్, భగవాన్ పూర్ , లీముగుడా పటేళ్లు ఆడే మల్కు , తొడసం సంబు, మహాజన్లు మెస్రం దత్తు, దత్యల్ భగవాన్, మాజీ సర్పంచ్ రేష్మ , యువరాజ్ విష్ణు, నగేష్, రాము, బీజేపీ పార్టీ మండల కన్వీనర్ అంకం అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story